top of page
Search

The Life and Teachings of Helena Blavatsky: An Introduction to the Founder of Theosophy

  • Dec 12, 2023
  • 4 min read

సముద్రం మీది నుండి చల్లని పల్లగాలులు వీస్తున్నాయి. సముద్రం ఎటువంటి కల్లోలం లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంది. దూరంగా ఏవేవో తీరాలకు సాగిపోతున్న పడవలు. సాగర తీరంలో ఎవరెవరో చిన్న చిన్న గుంపులుగా చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు. సముద్ర తీరం లో కొందరు పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. ఒక పాప తన రెండు కాళ్ళు ఇసుకలో దూర్చి బొమ్మరిల్లు కడుతోంది. ఇంకొక పాప రంగురంగుల గవ్వలు ఏరుతోంది. అక్కడ చనిపోయిన చెపల పొలుసులు కొన్ని పడి ఉన్నాయి. కొన్ని నత్తగుల్లల డిప్పలు కూడా కనబడుతున్నాయి. ఇంతలో ఒక పాప కొంచెం దూరంగా ఉన్న ఒక ఎముక ముక్కను తీసుకొని వచ్చి తన చెల్లెలికి చూపించింది. ఆ తెచ్చిన అమ్మాయి పేరు సత్లవానా.

ఏయ్ మున్నీ! ఇదిగో, నాకు ఒక ఎముక దొరికింది. ఇదేదో సముద్ర జంతువుది అయి ఉంటుంది, అంది సత్లవానా.

మున్ని ఆ ఎముకను చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలీంచింది. ఉన్నట్టుండి పెద్దగా నవ్వింది.

అదిగో గుర్రాలు, అంటూ కేక పెట్టింది. చిన్నపిల్లలు అటూ ఇటూ చూశారు కానీ ఎక్కడా గుర్రాలు కనిపించలేదు.

అరుగో! సాయుధులైన భటులు యుద్ధానికి పోతున్నారు. యుధ్ధం అంటే ఏమిటి ! మరణమే అన్నది మున్ని.

యుద్దమా ! భటులా? ఎక్కడ ?

అదిగో ! ఆ వెళ్ళిన యోధులంతా చచ్చిపోయారు " అంటూ కన్నీరు కార్చింది మున్నీ.

చిన్న పాపలు మున్నీని చూసి నవ్వుతున్నారు . కేరింతలు పెడుతూన్నారు. గుప్పిళ్ళతో ఇసుక గాలిలోకి విరజిమ్ముతూ ఉన్నారు.

అప్పుడు మున్నీ ఇలా చెప్పింది. " ఇదిగో! ఆ యుద్దంలో చనిపోయిన ఒక సైనికుని ఎముకయే ఇప్పుడు నా చేతిలో ఉంది" . ఆదిత్యయోగీ..

ree

చిన్న పాపలు అంతా చప్పట్లు చరిచి మరోసారి కేరింతలు పెట్టారు.

అయితే " ఈ చేప సంగతి ఏమిటి? " అంటూ నతాషా ప్రశ్నించింది.

మున్నీ చేపను నిశితంగా పరిశీలీంచింది.

"అవును. ఈ చేప చనిపోయి నూరేళ్ళు అయింది. ఇప్పుడు దాని పొలుసులు చూస్తున్నాం. ఈ చచ్చిన చేప ఎక్కడో తిమింగలం గా పుట్టింది'' అంది మున్నీ.

పిల్లలు ''భలే భలే" అంటూ చప్పట్లు కొట్టారు.

ఒక గాలి పొర ఇసుకను పైకి లేపింది. పిల్లలంతా లేచి నిలబడి గెంతుతున్నారు.

"అయితే ఈ గాలి కూడా నూరేళ్ళ నాటిదేనా!?"

" కాదు . కోటి సంవత్సరాల నాటిది. అప్పటి నుండి ఇలా మెల్ల మెల్లగా వీస్తూ మన దగ్గరకు వచ్చింది"

పిల్లలంతా కలిసి మున్నీని ఎగతాళి పట్టించారు. భూమి, ఆకాశం, నిజానికి కలవవు. దూరం నుంచి చూస్తే కలిసినట్లు ఒక భ్రాంతి కలుగుతుంది. దానినే హైరైజన్ అని ఇంగ్లీషులో అంటారు. తెలుగు లో క్షితిజ రేఖ అని పేరు.

క్రమ క్రమంగా చీకటి పడుతోంది. పిల్లలు ఒక్కొక్కరే గృహోన్ములైనారు.

ఏయ్! మున్నీ నువ్వు కదలవే!?



మున్నీ మాట్లాడటం లేదు. ఏవో లోకాల వైపు చూస్తోంది.

క్షితిజ రేఖలను దాటి ఆమె చూపులు ఎక్కడో దాటిపోతున్నాయి.

దట్టంగా చీకటి పడింది. మున్నీ అలాగే ఆకాశం వంక చూస్తూ కూర్చుంది. కొంత సేపటికి ఆ పాపను వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు.

మున్నీ అసలు పేరు ...

#బ్లావెట్క్సీ .

పూర్తి పేరు #హెలీనా పెత్రియాచో బ్లావెట్క్సీ.

బ్లావెట్క్సీ కి పెళ్లి చేస్తే ఆమె పరిస్థితి చక్కబడుతుంది అని ఇంట్లో ఆలోచించారు. అయితే ఈ అమ్మాయిని గురించి తెలిసిన వారు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఎందుకు అంటే ఈమె దయ్యపు పిల్ల, పూనకం వచ్చినట్టు ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. వాటికి అర్థం పర్థం ఉండదు. ఇంక చదువుకు కూడా స్వస్తి చెప్పింది. ఒంటరిగా గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని తనలో తాను ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎదురుగా ఎవరో ఉన్నట్లుగా భావించుకొని దాన్ని నమ్ముతూ వారికి సమాధానాలు చెబుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఎవరూ ఉండరు, బ్లావెట్క్సీ తప్ప.

పేత్రోవా ఒక రాజ కుటుంబీకుడు. ఉక్రేన్ రాష్ట్రంలో జార్ చక్రవర్తికి సంబంధించి ఒక రాజ ఉద్యోగి. పెద్ద భూస్వామి. అలాంటి వ్యక్తి కడుపున ఈ రకమైన పిల్ల ఎలా పుట్టింది!? కొందరు బందువులు నన్ను ఎగతాళి కూడా చేస్తున్నారు.

" ఏ కూతురు అలగా జనంతో కలిసి సముద్ర తీరంలో గవ్వల ఆటలు ఆడుకుంటున్నది? మనమేమిటి? ఆ జాలరి పిల్లల స్థాయి ఏమిటి? అని పెత్రోవా బందువులు మృదువుగా చివాట్లు పెట్టారు కూడా.

ఆ మాటతో పేత్రోవా తన భార్య హేలినాకు చెప్పాడు. ఈమె జర్మనీ దేశస్థురాలు. హేలీనా తన కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలని ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. చిన్నప్పుడే క్రిస్టియన్ ఆర్థడాక్స్ చర్చికి తీసుకుని వెళ్లి ఈ పాపకు మంత్రజలం నెత్తి మీద పోసి బాసిస్టు సంస్కారాలు కూడా చేశారు.అంటే ఆ పిల్ల ఏసు క్రీస్తు రక్షణలో ఉంది.

అలాంటప్పుడు ఈమెకు ఈ సైతాన్ చర్యలు ఎలా వచ్చాయి? ఓ రోజు సాయంత్రం బ్లావెట్క్సీ సముద్ర తీరానికి వెళ్లి కూర్చుంది. అటు వినీలాకాశం, ఇటు వినీల సముద్రం రెండు కలిసినట్లు కనబడుతోంది. ఆకాశంలో మబ్బులవలనే సముద్రంలో అలలు తెరలు తెరలుగా, పొరలు పొరలుగా సాగిపోతున్నాయి.

మున్నీ (బ్లావెట్క్సీ) సముద్రం వైపు ఏకాగ్రత గా చూస్తోంది . ఇంతలో ఉన్నట్లుండి నీలి సముద్రం తెల్లగా మారిపోయింది. అందులో నుండి ఒక తెల్లటి గుఱ్ఱము పైకి వచ్చింది. ఆ గుఱ్ఱము మీద ఒక రౌతు కూర్చొని ఉన్నాడు. భూమి మీద నడిచినట్లే ఆ గుఱ్ఱము సముద్రపు అలల మీద చాలా వేగంగా పరిగెత్తుకుంటూ సముద్రతీరానికి వచ్చింది. హయ హేషలో ఒక ఆత్మ ఘోష.

అప్పుడు గుఱ్ఱము మీద కూర్చొని ఉన్న వ్యక్తి కిందకు దిగాడు.

"అమ్మాయ్ బ్లావెట్క్సీ బాగున్నావా? అని పలకరించాడు.

" అయ్యా మీరు ఎవరు!? నేను మీకు ఎలా తెలుసు !? "

"అమ్మాయ్ , నువ్వు నాకు చాలా జన్మలు గా తెలుసు.! మీ అమ్మ హెలినా గురించి కూడా తెలుసు. రాబోయే క్రిమియా యుద్ధం గురించి కూడా తెలుసు!"

"క్రిమియా యుద్దమా!?

" అవును , అలాంటి యుద్ధం రాబోతోంది. అప్పుడు బ్రిటిష్ వారికి, రష్యన్లకు మధ్య వైమన్యసం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు కొంత జాగ్రత్తగా ఉండాలి"!!

"ఎందుకు? "

"ఎందుకు అంటే మీ నాన్న నిన్ను లండన్ తీసుకుని వెళతారు కాబట్టి"

" అయ్యా ! మీరెవరో అతీంద్రియ శక్తి గల దేవ పురుషుల్లా కనబడుతున్నారు. మీ పేరు ఏమిటి ? ఎక్కడ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? "

" అమ్మాయ్ అన్ని విషయాలు వివరంగా చెబుతాను విను. నా పేరు #ఆర్యయోగి. నేను #మగధ సామ్రాజ్యం నుంచి వచ్చాను"

"అది ఎక్కడ ఉంది?

" అది భారత దేశంలో గంగానది తీరంలో ఉంది "

" బ్లావెట్క్సీ మనసులో మౌర్య, ఆర్య అన్న రెండు శబ్దాలు కలిసి పోయాయి"

"అయ్యా ! మౌర్యయోగి గారూ, మీరు ఇక్కడికి ఎవరిని చూడటం కోసం వచ్చారు?"

"నిన్ను చూడటం కోసమే అమ్మాయి. నువ్వు ఒక కారణ జన్మురాలివి. కొన్నాళ్ళ తర్వాత నువ్వు భారత దేశానికి వస్తావు. అక్కడ నీ వలన కావాల్సిన కార్యం ఒకటి ఉంది. ఇదిగో! ఈ తెల్ల గుఱ్ఱము . దీని పేరు #ఉఛ్ఛైశ్రవము. దీనిని నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ రోజు నుంచి దీని మీద ఎక్కి ప్రపంచం అంతా తిరగవచ్చు. ఇది #దేవేంద్రుని వద్ద ఉంటుంది. ఇది పాల సముద్రంలో పుట్టింది. చూడటానికి నీవు పడవల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద ప్రయాణం చేస్థున్నట్లు ప్రపంచానికి కనబడుతుంది. కానీ నిజానికి నువ్వు ప్రయాణం చేసేది ఈ తెల్ల గుఱ్ఱము మీదనే. ఈ సంగతి నీకు, నాకు తప్ప మూడవ కంటి వారికి తెలియదు"

" మౌర్యయోగి గారూ! ఇంతకూ మీరెవరు!? మనిషా!? , దేవతా!? దెయ్యమా!? "

" అమ్మాయ్ విను! మనిషికి శరీరం ఉంటుంది. అది పంచభూతాల చేత నిర్మించబడుతుంది. చెట్టు, చేమ, మనిషి, జంతువు అన్ని పంచ మహా భూతాల చేతనే నిర్మించబడ్డాయి. కానీ దేవతల శరీరాలు తేజస్సు చేత నిర్మించబడ్డాయి. కాబట్టి అవి కంటికి కనబడాలనే అవసరం ఏం లేదు, గాలిలో ఎన్నో సూక్ష్మ క్రిములు ఉన్నాయి. అవి కంటికి కనబడుతున్నాయా ఏమిటి!?

మనుషులకు కాళ్ళు, చేతులు ఉంటాయి. పక్షులకు రెక్కలు ఉంటాయి. జంతువులకు కొమ్ములు ఉంటాయి. అంటే మనం భౌతికమైన సృష్టిని స్థావర, జంగమ రూపాల్లోనే ఊహించుకోగలుగుతాము. ఇందుకు భిన్నంగా కూడా సృష్టి ఉండవచ్చు. భూమి మీద సృష్టి ఒక రకంగా ఉంటే, ఆకాశంలో , సముద్రంలోను, ఇతర గోళాల్లోను, వేరే వేరే రూపాల్లో ఉండవచ్చు. మనం నీటిలో బ్రతకలేం. చేపలు భూమి మీద జీవించలేవు. ఇది సృష్టి రహస్యం.

"ఆర్య స్వామి గారు! మిమ్మల్ని ఇంక మీదట #మౌర్య అని పిలుస్తాను. మీరు నిజమైన అతీంద్రియ శక్తి గలవారు అయితే నా వంశ చరిత్ర మొత్తం చెప్పండి.

అప్పుడు ఆర్య స్వామి బ్లావెట్క్సీ వంశ చరిత్ర అంతా చెప్పాడు...

.

చిష్ట్య, నక్షబందియ అనే రెండు భిన్న సూఫీ సాంప్రదాయాల సంగీతం

ఈ రెండు సూఫీ సాంప్రదాయాలలో, వికాసం చెందిన వ్యక్తులు సంగీతాన్ని వినడం అనే ఉద్దేశం సమంజసమే. ఒక వర్గం వారికి సంగీతం పట్ల తీవ్రమైన ఆసక్తి ఉంటుంది. మరొక వర్గం సంగీతాన్ని అత్యంత జాగ్రత్తగా వింటుంది. ఆనందం కోసం సంగీతాన్ని వినడం కూడా కొంతమేరకు సరైనదే, అని ఆత్మను కొంతవరకు ఉద్ధరిస్తుంది అని భావించడం కూడా తప్పుకాదు.

కాబట్టి. ఆనందం కోసం సంగీతం వినడాన్ని కొంతవరకు అనుమతించినప్పుడు, దాన్ని ఆత్మానందం కలిగించే ఒక మార్గంగా ఎందుకు అనుమతించకూడదు?

ఏ విధంగా చూసినా, సంగీతం వినడానికి అనుమతి ఉంది. ఎందుకు? ఎంత మేరకు సంగీతాన్ని అనుమతించవచ్చు?

అలాగే సంగీతాన్ని ఎందుకు అనుమతించకూడదో తెలిపే వివరణ ఈ రెండు సాంప్రదాయ గ్రంధాల్లోనూ లభిస్తుంది. అనుమతించిన హద్దులు దాటి వెళ్ళడాన్ని పెద్ద నేరంగా పరిగణిస్తారు సంగీతాన్ని వినడం కేవలం కాలక్షేపానికే.....*

 
 
 

Recent Posts

See All
ఈ తప్పులు మీరు చేస్తున్నారా?

1.భోజనం చేసేటప్పుడు కడుపుపై చేయి వుంచి నిమరకండి. అది దరిద్ర దేవతకు స్వాగతం పలకటమే అవుతుంది. 2. చాకు, కత్తి వాటితో సరదాకైనా నేలపై...

 
 
 

Comments


contact

SREE SANNIDHI TV,

H. No. 63/1, Flat No. 302,

Sri Sai Teja Residency,

Vengala Rao Nagar,

Hyderabad 500038

Tel: +91 40 40054709,

Mobile: 8074767317

sreesannidhitv@gmail.com

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Twitter
  • YouTube

© 2023 Sree Sannidhi TV

bottom of page