ఓం నమో భగవతే శ్రీ రమణాయ
- thedirector108
- Dec 12, 2023
- 1 min read

రాబర్ట్ ఆడమ్స్(1928 - 97) అమెరికా దేశస్థుడు. ఒకనాడు అతనికి తన ప్రక్కన ఒక భారతీయుడు నిలబడినట్టు కల వచ్చింది. ఈ కల గురించి క్రియాయోగ పరమహంస యోగనందని సంప్రదించగా ఆయన రమణ మహర్షి ఫొటోని చూపారు. తనకి కలలో కనబడినది వారే అని ఆడమ్స్ గ్రహించాడు.
కొంతకాలానికి తిరువణ్ణామలైకి ప్రయాణం అయ్యాను. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. రమణాశ్రమానికి చేరుకునేప్పటికి ఉదయం 8-30 అయ్యింది. మహర్షి సోఫా మీద కూర్చుని ఉత్తరాలను చూస్తున్నారు. నన్ను చూచి చిరునవ్వు నవ్వారు. నేను కూడ చిరునవ్వు నవ్వాను.
మహర్షి 'ఫలహారం చేశావా!' అని అడిగారు. ఇంకా చేయలేదని చెప్పి, తర్వాత నేను ఫలహారం చేసాను. బాగా అలసిపోయి ఉన్నందువల్ల నేలమీద నడుం వాల్చాను.
తరువాత మహర్షి స్వయముగా నన్ను ఒక గుడిసె వద్దకు తీసుకువెళ్లి "ఆశ్రమంలో ఉన్నంతకాలమూ నేను అక్కడ ఉండవచ్చు" అని అన్నారు. నా ప్రయాణం ఎట్లా సాగిందని, నా ఊరు ఏదని, నా రాకకు కారణం ఏమిటని అడిగారు. అంతా చెప్పాను. మహర్షి అంతా ఓపికగా విని, నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్లిపోయారు.
నా కోసం భోజనం స్వయంగా మహర్షే తెచ్చారు. దీన్ని ఎవరైనా అసలు ఊహించగలరా? కాసేపు మాట్లాడుకున్నాం. భోజనం చేసి మళ్లీ నిద్రపోయాను.
సాయంత్రం దాదాపు అయిదు గంటలకి మహర్షి స్వయంగా వచ్చి నన్ను నిద్ర లేపారు.
ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు మహర్షి నా మీద చూపిన అంతటి కరుణను, ప్రేమనూ నేను ఎక్కడా చూడలేదు.
మహర్షి, జీసెస్ .... ఉపదేశించిన తీరు
జీసస్ "స్వర్గధామం నీలోనే ఉంది" అని అన్నారు.
మహర్షి "ఆత్మ నీలోనే ఉంది. అన్వేషించి కనుక్కో!" అని అన్నారు.
జీసస్ "నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నాకు ఉన్నదంతా నీకే!" అని అన్నారు. మహర్షి "నేను మిమ్మల్ని ఎప్పుడూ వీడను. ఎల్లవేళలా మీతోనే ఉంటాను" అని అన్నారు.
నేను 1947 నుండి 1950 వరకూ రమణుల సన్నిధిలో గడిపాను. అలాగే మహర్షి కరుణ ఎప్పుడూ నన్ను వీడలేదు.
అమెరికాలో నిర్వహించిన రమణ మహర్షి సత్సంగాల గురించి “silence of the heart(హృదయపు మౌనం)" అనే గ్రంథాన్ని రచించారు ఆడమ్స్.



Comments