శ్రీ మణిద్వీపేశ్వరి అష్టోత్తరశతనామావళిః
- thedirector108
- Jan 12, 2024
- 2 min read
*శ్రీ మణిద్వీపేశ్వరి అష్టోత్తరశతనామావళిః*
ఓం దివ్యలోకవాసిన్యై నమః
ఓం సర్వలోక సంరక్షణాయై నమః
ఓం సర్వమృత్యుసర్వాపద్వినివారణ్యై నమః
ఓం లలితాబాలా, దుర్గాశ్యామలాకృత్యై నమః
ఓం గంగా,భవానీ గాయత్రీ స్వరూపాయై నమః
ఓం లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ, స్వరూప విభవాయై నమః
ఓం రాజరాజేశ్వరీ దేవ్యై నమః
ఓం భక్తాభీష్టదాయిన్యై నమః
ఓం భక్తిభుక్తిముక్తి ప్రదాయిన్యై నమః
ఓం భక్తసంకల్పసిద్ధిదాయై నమః ॥౧౦॥
ఓం పృధ్వీశ్వరీ దేవ్యై నమః
ఓం ఆధివ్యాధి నివారిణ్యై నమః
ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం సృష్టి స్థితిలయాయై నమః
ఓం అష్టసిద్ధి నవనిధి ప్రదాయిన్యై నమః
ఓం అష్టదిక్పాలక వందితాయై నమః
ఓం త్రికాల వేదిన్యై నమః
ఓం షడ్గుణ సం సేవితాయై నమః
ఓం షడ్రుతు పరివేష్టితాయై నమః ॥౨౦॥
ఓం నవగ్రహవిధివిధానాధిష్టానాయై నమః
ఓం సత్యధర్మ శాంతి ప్రేమ ప్రసాదిన్యై నమః
ఓం సర్వకాల సర్వావస్థా సమస్థితాయై నమః
ఓం అనంతసాగర, నదీనదా కృత్యై నమః
ఓం కాంస్య (కంచు) లోహమయ ప్రాకారిణ్యై నమః
ఓం పీత (ఇత్తడి) లోహమయి ప్రాకారిణ్యై నమః
ఓం తామ్ర(రాగి) లోహమయ ప్రాకారిణ్యై నమః
ఓం సీసలోహమయ ప్రాకారిణ్యై నమః
ఓం పంచలోహమయ ప్రాకారిణ్యై నమః
ఓం రజితసాల ప్రాకారిణ్యై నమః ॥౩౦॥
ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః
ఓం పుష్యరాగమయ ప్రాకారిణ్యై నమః
ఓం పద్మరాగమయ ప్రకారిణ్యై నమః
ఓం గోమేధికమణిమయ ప్రాకారిణ్యై నమః
ఓం వజ్రనిర్మిత ప్రాకారిణ్యై నమః
ఓం వైడూర్యనిర్మిత ప్రాకారిణ్యై నమః
ఓం ఇంద్రనీలమణిమయ ప్రాకారిణ్యై నమః
ఓం మరకతసాలమయ ప్రాకారిణ్యై నమః
ఓం ప్రవాళసాలమయ ప్రాకారిణ్యై నమః
ఓం రత్నసాలమయ ప్రాకారిణ్యై నమః ॥౪౦॥
ఓం చింతామణిమయ ప్రాకారిణ్యై నమః
ఓం శృంగారమండప దేవదేవతాయై నమః
ఓం జ్ఞానమండప జ్ఞానేశ్వరీదేవ్యై నమః
ఓం ఏకాంతమండప ధ్యానేశ్వరీదేవ్యై
ఓం ముక్తిమండప ముక్తేశ్వరీదేవ్యై నమః
ఓం కాశ్మీరవన కామాక్షీదేవ్యై నమః
ఓం మల్లికావన మహారాజ్ఞై నమః
ఓం కుందవన కౌమారీదేవ్యై నమః
ఓం కస్తూరీవనకామేశ్వరీ దేవ్యై నమః
ఓం సాలోక్యముక్తి ప్రసాదిన్యై నమః ॥౫౦॥
ఓం సాలోక్యముక్తి ప్రసాదిన్యై నమః
ఓం సారూప్యముక్తి ప్రదాయిన్యై నమః
ఓం సామీప్యముక్తిదాయిన్యై నమః
ఓం సాయుజ్యముక్తి సుప్రసాదిన్యై నమః
ఓం ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి రూపిణ్యై నమః
ఓం వరాంకుశపాశాభయ హస్తాయై నమః
ఓం సహస్రకోటి సహస్రవదనాయై నమః
ఓం మకరం దఘృతాంబుధయే నమః
ఓం సహస్రకోటి సహస్రచంద్ర సమసుధానేత్రాయై నమః
ఓం సహస్రకోటి సహస్ర సూర్య సమాభాసాయై నమః
ఓం జరామరణ రహితాయై నమః ॥౬౦॥
ఓం నారదతుంబురు సకల మునిగణవందితాయై నమః
ఓం పంచభూతయజమాన స్వరూపిణ్యై నమః
ఓం జన్మజన్మాంతర దుఃఖభంజనాయై నమః
ఓం లోకరక్షాకృత్యతత్పరాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు మహేశ్వర కోటి వందితాయై నమః
ఓం చతుషష్టి కళా సంపూర్ణ స్వరూపిణ్యై నమః
ఓం షోడశకళా శక్తి సేనా సమన్వితాయై నమః
ఓం సప్తకోటి ఘనమంత్ర విద్యాలయాయై నమః
ఓం మదన విఘ్నేశ్వర కుమార మాతృకాయై నమః
ఓం కుంకుమ శోభిత దివ్య వదనాయై నమః ॥౭౦॥
ఓం అనంతనక్షత్ర గణనాయికాయై నమః
ఓం చతుర్దశభువన కల్పితాయై నమః
ఓం సురాధినాథ సత్సంగ సమాచార కార్యకలాపాయై నమః
ఓం అనంగరూపపరిచారికా సేవతాయై నమః
ఓం గంధర్వ యక్షకిన్నర కింపురుష వందితాయై నమః
ఓం సంతాన కల్పవృక్ష సముదాయ భాసిన్యై నమః
ఓం అనంతకోటి బ్రహ్మాండ సైనికాధ్యక్ష సేవితాయై నమః
ఓం పారిజాత, కదంబనవిహారిణ్యై నమః
ఓం సమస్తదేవీ కుటుంబ వందితాయై నమః
ఓం చతుర్వేద కళాచాతుర్యై నమః ॥౮౦॥
ఓం బ్రాహ్మీ మహేశ్వరీ వైష్ణవీ వారాహీ వందితాయై నమః
ఓం చాముండీ మహాలక్ష్మీ ఇంద్రాణీ పరిపూజితాయై నమః
ఓం షట్కోణ యంత్ర ప్రకాశిన్యై నమః
ఓం సహస్రస్తంభ మండపవిహారిణ్యై నమః
ఓం సమస్త పతివ్రతాసం సేవితాయై నమః
ఓం నాదబిందు కళాతీత శ్రీ చక్రవాసిన్యై నమః
ఓం పాపతాప దారిద్ర్య నాశిన్యై నమః
ఓం శ్రుతి, స్మృతి, పురాణ కావ్య సంరక్షణాయై నమః
ఓం పంచబ్రహ్మాసన విరాజితాయై నమః
ఓం వజ్రవైడూర్య మరకత మాణిక్య చంద్రకాంత రత్నసింహాసన శోభితాయై నమః ॥౯౦॥
ఓం దివ్యాంబర ప్రభాదివ్యతేజో విభాసాయై నమః
ఓం పంచముఖ సర్వేశ్వర హృదయాధిష్టానాయై నమః
ఓం ఆపాద మస్తక నవరత్న సువర్ణాభరణ ధారిణ్యై నమః
ఓం విలాసినీ అఘోరా మంగళాసనా పీఠశక్తి వందితాయై నమః
ఓం క్షమా, దయా, జయా, విజయా పీఠశక్తి పరిపాలితాయై నమః
ఓం అజితా, అపరాజితా, నిత్యపీఠశక్తి పరిపూజితాయై నమః
ఓం సిద్ధి, బుద్ధి, మేధా, లక్ష్మీ, శృతి పీఠశక్తి సేవితాయై నమః
ఓం లజ్జాతుష్టిపుష్టి పీఠశక్తి ప్రభాసితాయై నమః
ఓం నవరాత్ర దీక్షా ప్రియాయై నమః
ఓం నామ, గాన, జ్ఞాన యజ్ఞ ప్రియాయై నమః ॥౧౦౦॥
ఓం జపతపో యోగత్యాగ సంతుష్టాయై నమః
ఓం పంచదశీ మహావిద్యాయై నమః
ఓం సదాషోడశ ప్రాయసర్వేశ్వర వల్లభాయై నమః
ఓం ఓంకారాక్షర స్వరూపిణ్యై నమః
ఓం సకలయంత్ర సకల తంత్ర సమర్చితాయై నమః
ఓం సహస్ర యోజన ప్రమాణ, చింతామణి గృహవాసిన్యై నమః
ఓం మహాదేవసహిత శ్రీ పరమేశ్వరీ దేవ్యై నమః
ఓం మణిద్వీప విరాజిత మహా భువనేశ్వరీ దేవ్యై నమః ॥౧౦౮॥
*|| శ్రీ మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||*

